మన హక్కులు – మన చట్టాలు
#ఓటు_హక్కు_సామాన్యుని_చేతిలో_వజ్రాయుధం*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : మన దేశంలో బ్రిటిషుర్ల పరిపాలన కాలంలోనే పుట్టిన ఓటు హక్కు 1988 సం.లో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పనకు సవరణ చేశారు. 1988 సంవత్సరం ముందు 21 సంవత్సరాల వయసు నిండిన వారికి ఓటు హక్కు ఉండేదాని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదే. ఎన్నికల్లో తమకు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఈ ఓటు ఎంతో కీలకం. ఎక్కడైనా, ఏనోట విన్నా అంతటా రాజకీయాల గురించి ఒక్కటే చర్చ. ఈ సందర్భంలో ఓటు గురించి అందరూ మాట్లాడుకుంటున్నా ఓటుహక్కు పుట్టు పూర్వోత్రాలు గురించి అతి తక్కువ మందికే తెలుసు ఓటు హక్కు గురించి తెలుసుకుందాం..
ఆంగ్లేయుల కాలంలో మొదలైన ఎన్నికల ప్రక్రియ 1938 నాటికి ఓ రూపానికి వచ్చింది. ఓటు అసలు కథ పరిశీలిస్తే బ్రిటిషుర్ల పాలనలో పరిమిత ప్రాతిపదికన భారతీయులకు కల్పించిన ఓటు హక్కును భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కుగా కల్పించింది.
1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు కల్పించారు.
1919 కౌన్సిల్ చట్టం ఈ హక్కును కొంతమేర విస్తృత పరిచింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ హక్కును 10.6శాతానికి పెంచారు. రాజ్యాంగ పరిషత్, ఎన్నికల సందర్భంగా 28.5శాతం ప్రజలకు దీన్ని విస్తరింపచేశారు.
స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి ఉండడంతో రాజ్యాంగం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి 325 ఆదికరణ ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే కల్పన కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతం, లింగ భేదాలు వంటి తేడాలతో ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించకూడదంటూ నిబంధనలు జారీ చేసింది.
326వ ఆధికరణ కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21ఏళ్ల నుంచి 18ఏళ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కుగా ప్రాముఖ్యతను చేకూర్చింది
ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓటు హక్కు కల్పించారు. ఓట్లు వేసిన అభ్యర్థులను “ఓటర్లు” అని పిలుస్తారు. ఓట్లు సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి. మహిళల ఓటు హక్కును ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఫిన్లాండ్.
*భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ వంటిది. మనదేశంలో ఓటు హక్కు సమాన్యునితో చేతిలో వజ్రాయుదంగా మారింది.*
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, భారతీయ శిక్షా స్మృతులతో పాటు ఎన్నో చట్టాలు ఎన్నికల ప్రక్రియ పరిశుద్ధంగా, నీతివంతంగా, అత్యంత పారదర్శకంగా జరగడం కోసం ఎన్నో నియమాలు, సూత్రాలు పొందుపరిచాయి. ఎన్నికలు సజావుగా సక్రమంగా శాంతియుతంగా జరగకుండా అడ్డుపడిన వ్యక్తులను కానీ శక్తులను కానీ కఠినంగా శిక్షించడానికి కట్టుదిట్టమైన చట్టాలు కూడా ఏర్పరిచాయి.
*ఓటు దాని పవర్ గురించి తెలుసుందాం*
వయోజనుడు కేవలం ఓటరు మాత్రమే కాక పౌరుడు కూడా ఓటరుగా తన ఓటు హక్కును నిష్పాక్షికంగా నిర్భయంగా వినియోగించుకోవడం ఎంత అవసరమో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు సహకరించడం కూడా అంతే అవసరం. ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
భారత రాజ్యాంగం లోని అధికారణ 326 ప్రకారం
సార్వత్రిక ఓటు హక్కునికల్పించింది. 18 ఏళ్ళ వయసుకు తక్కువ కాని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారత లోక్‌సభకు , రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
1950 నుండి భారతదేశంలో అమలులోకి వచ్చిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎంతో విప్లవాత్మకమైన చర్య. ముఖ్యంగా సార్వత్రిక ఓటు హక్కు చరిత్రను మనం చూసినట్లయితే ఎన్నో దేశాల్లో అది సాధ్యం కావడానికి వందల ఏళ్ళు పట్టింది. భారతదేశంలో సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టే నాటికి గ్రీసు, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కొన్ని కొన్ని వర్గాల వారికి ఓటు హక్కు అందలేదంటే భారత రాజ్యాంగం చూపించిన రాజకీయ పరిణతి ఎంత ప్రశంస నీయమో తెలుస్తుంది.
చాలా దేశాల్లో ప్రజలందరికీ వారికి నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకుని ఏర్పాటు చేసుకునే హక్కు ఇప్పటికి లేదు. అటువంటి హక్కు సిద్ధించిన ప్రజాస్వామికదేశాల్లో కూడా చాలాకాలం పాటు పారదర్శక ఓటు హక్కు అంటే కేవలం పురుషుల ఓటు హక్కు. కొన్ని దేశాల్లో ఓటు హక్కు ధనికులకు మాత్రమే పరిమితమైన అవకాశం. కానీ *భారత రాజ్యాంగం జాతి, మతం, కులం, భాష, లింగం వంటి ప్రాతిపదికలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించింది.*
ఓటు వేయడానికి హక్కు అంటే పౌరుడు తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నికల్లో గెలిపించడానికి ఓటు వేయడం ద్వారా ప్రభుత్వ నిర్మాణంలో భాగం పంచుకోవడం అని అర్ధం. అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఈ ఓటు హక్కు ద్వారా సంక్రమించింది.
జన్మించిన తేదీ నాటికి 18 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసుకలిగిన వారు ఆ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న వారు ఆ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు కావడానికి అర్హులు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ. సంవత్సరం పొడవునా సాగుతూనే ఉంటుంది. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారమ్ 6లో పేరు నమోదు చేసుకోవాలి. తొలగింపులో ఫారమ్ 7 ఉపయోగపడుతుంది. సవరణ కోసం ఫారమ్ 8ని వినియోగించుకోవాలి. నియోజకవర్గ నుండి మరో నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఫారమ్ 8ఎ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో కానీ, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కానీ, తహశీల్దార్ కార్యాలయంలో కానీ ఓటు అమలు చేయించుకోవచ్చు.
నిర్భయంగా ప్రశాంతంగా ఏకాంతంగా ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పూర్వం బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు. ప్రస్థుతం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో ఓటు నమోదు చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసిన వారికి రశీదు కూడా ఇచ్చే అవకాశాన్ని అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ భూత్‌లో ఓటువేయడానికి వెళ్లిన ఓటరు తన ఓటు అప్పటికే వేరొకరు వేసినట్లు తేలితే రెండవ ఓటు వేయవచ్చు. అందుకు ఓటరు తన గుర్తింపును నిరూపించుకోవలసి ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు మాత్రమేనని అందరూగుర్తించాలి. తాను ఎన్నుకునే అభ్యర్ధి గుణగణాలను పూర్వచరిత్రను సేవాగుణాన్ని, సమర్ధతను పరిగణలోనికి తీసుకుని ఓటు వేయాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ఎన్నికల్లో పాల్గొనాలి.
*ఓటుహక్కు పొందుటకు గుర్తింపు పత్రాలు*
ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్ పోర్టు,
1. డ్రైవింగ్ లైసెన్స్,
2. పాన్ కార్డు,
3. ఆధార్ కార్డు
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
5. బ్యాంకు, కిసాన్, పోస్టాఫీస్ పాసుబుక్కులు,
6. విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
7.పట్టాదారు పాసు పుస్తకాలు,
8.రిజిస్టర్డ్ డీడ్ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
9. రేషన్ కార్డు,
10. ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
11. పెన్షన్ మంజూరు పత్రాలు,
12. రైల్వే గుర్తింపు కార్డు,
13. స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
14. ఆయుధ లైసెన్స్‌లు,
15. వికలాంగుల పత్రాలు.
ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొలగించే ముందు ఓటరుకు కారణాలను తప్పక తెలియజేయాలి. తొలగించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి.
ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలోంచి ఓటర్ల పేర్లు తొలగించారని గగ్గోలు పెట్టడం వింటూ ఉంటాం. ఒక ఓటరు తన ఓటు హక్కు ను హరించారంటూ ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎం దుకు తొలగించారో తెలియజే యాలని కోరాడు. ఆ యువ కుడి పేరు సుమిత్. 21 సంవత్సరాల వయసు దాటింది. ఓటరుగా నమోదు చేసుకున్నాడు. ఓటర్ల జాబితాలోకి అతని పేరు ఎక్కింది కూడా. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశాడు. కాని 2015లో మళ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో ఓటర్ల జాబితాలో లేకపోవడంవల్ల తను ఓటు వేయలేకపోయాడు.
తన ఓటరు చిరునామా మారలే దని, అదే ఇంట్లో ఉంటున్నానని, కాని తనకు తెలపకుం డా తన పేరును జాబితా నుంచి తొలగించడం వల్ల తాను ఓటు వేయలేకపోయాయని అతను వాదించాడు. తన పేరు తీసేసే ముందు తనకు తెలియజేయలేదని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినా జవాబు ఇవ్వలేదని, మొ దటి అప్పీలులో కూడా జవాబు లేకపోవడం వల్ల కమి షన్ ముందుకు వచ్చానని వివరించాడు. మన రాజ్యాంగం 15వ భాగంలో ఎన్నికల వ్యవహా రం గురించి నియమాలున్నాయి. ఆర్టికల్ 325 ప్రకారం మతం, జాతి, కులం, ఆడామగ తేడా పైన ఓటర్ల జాబి తాలో చేర్చడంలో అనర్హత విధించడానికి వీల్లేదు.
వయో జన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు జరపాలని ఆర్టి కల్ 326 నిర్దేశిస్తున్నది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద అభి ప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి కూడా ఓటు హక్కు వస్త్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలతోపాటు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62 ప్రకారం ఓటర్ల జాబి తాలో పేరున్న ఓటర్లందరూ ఓటు వేయడానికి అర్హులని నిర్దేశిస్తున్నది. ఓటరు అన్న నిర్వచనం కూడా జాబితాలో పేరున్న వారు అని ఉంది. సెక్షన్ 16లో అనర్హతలు వివ రించారు.
ఓటు హక్కు రాజ్యాంగపరంగా పౌరుడికి ప్రసాదించిన కీలకమైన హక్కు అనీ, అయితే చట్టంలో ఈ హక్కును మరింత బలోపేతం చేశారనీ, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఇది చాలా మౌలికమైన ఆధారమని సుప్రీంకోర్టు 2013లో పి.యు.సి.ఎల్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టం చేసింది. నోటీసు పంపిన తరువాత కూడా చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఎవరూ రాకపోవడం వల్ల వారి వాదం ఏమిటో ఎందుకు జవాబు ఇవ్వలేకపో యారో కమిషన్‌కు తెలిసే అవకాశం లేకుండా పోయిం ది. అభ్యర్థి అప్పీలుదారు వాదం ఒక్కటే కమిషన్ ముం దుకు వచ్చింది. చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయానికి రెండు బాధ్యతలు ఉన్నాయి.
ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొల గించే ముందు ఓటరుకు కారణాలను తెలియజేయవల సిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని సెక్షన్ 22 ప్రజా ప్రాతినిధ్య చట్టం, రూల్ 21ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్ 1960 కింద చాలా స్పష్టంగా నిర్దేశించారు. తొల గించే ముందు నోటీసు ఇవ్వడమే కాకుండా, అంతకు ముందు తన ఓటును రక్షించుకోవడానికి తన వాదం వినిపించే అవకాశాన్ని పూర్తిగా ఇవ్వాలి. ఆ తరవాత కారణాలు వివరిస్తూ ఓటరు పేరును తొలగిస్తున్న సమా చారం నోటిఫై చేయవలసి ఉంటుంది.
మీరే ఓటరు జాబితా చూడండి, మీ పేరు లేకపోతే ఫిర్యాదు చేయం డి, ఫలానా ఫారం నింపండి అని పత్రికలలో, టీవీలలో ప్రచారం చేసాం కనుక నోటీసు ఇచ్చినట్టే అని వాదించ డానికి వీల్లేదు. ఓటరుగా నమోదు కావడానికి ఈ వాదం పనికి వస్తుంది. కాని ఓటరుగా ఒకసారి లిస్ట్టులో చేరిన తరువాత, ఆ పేరును తొలగించడం అంటే హక్కును తొలగించడమే అవుతుంది కనుక తప్పనిసరిగా వ్యక్తి గతంగా నోటీసు ఇచ్చి తీరాలని, తరవాత వాదించే అవ కాశం ఇవ్వవలసి ఉంటుందని ప్రజాప్రాతినిధ్య చట్టం వివరిస్తున్నది. శ్రీమతి దార్ల రమాదేవి వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేసును 2009లో విన్న న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో ఈ విషయాలు వివరించారు.
ఓటర్లు కనబడకపోవడం వల్ల తాము ప్రత్యామ్నాయంగా నోటీసులు ఇచ్చామని కనుక నోటీసు ఇచ్చినట్టే అని చేసిన వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. కొన్ని వందల పేర్లు తొలగించారని, తాము పేర్కొన్న అడ్రసు గల ఇండ్లలో నివసించడం లేదనీ ఆరోపించారని పిటిషనర్లు కోర్ట్టుకు తెలిపారు. నిజానికి తాము ఊళ్లోనే ఉన్నామని వారు వాదించారు. తగిన నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపు చెల్లదని నరసింహారెడ్డి తీర్పు చెప్పారు. ఈ అంశంపైన ఇదే గణనీయమైన తీర్పు.
సమాచార హక్కు కింద అడిగినపుడు ప్రతిస్పం దించడం మరో బాధ్యత. సెక్షన్ 4(1)(సి) కింద తమ చర్యలవల్ల నష్టపోతున్న వారికి, ఏవైనా హక్కులు కోల్పో తున్న వారికి ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకు న్నారో తెలియజేయవలసిన బాధ్యత ఉందని తమంత తామే ఈ కారణాలు వెల్లడించాలని సమాచార హక్కు చట్టం వివరిస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎందుకు కారణాలు వివరించలేదు, ఎందుకు నోటీసు ఇవ్వలేదు, తమ వాదా న్ని వినిపించుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. సమా చార హక్కు చట్టం కింద అడిగినా ఎందుకు ప్రతి స్పం దించలేదో వివరించాలని, ఎందుకు జరిమానా విధిం చకూడదో కారణాలు తెలపాలని కమిషన్ నోటీసు జారీ చేసింది.
#ఓటింగ్_పద్ధతులు
■బ్యాలెట్ ఓటింగ్
ఒక ప్రజాస్వామ్యంలో ఓటు చేయడం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయబడుతుంది. ఎన్నుకునే విధానంలో పలువురు అభ్యర్థుల్లో ఎంపిక చేసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, ఓటింగ్ పద్ధతి ప్రకారం ఓటర్లు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపిక విధానం ఎన్నికల సంఘం గోప్యతా ఉంచుతుంది ఒక రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు. ఓటర్లు తమ రాజకీయ గోప్యతను కాపాడటానికి ఈ బ్యాలెట్ ఉపయోగ పడుతుంది.
■మెషిన్ ఓటింగ్
ఓటింగ్ యంత్రం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాలను ఉపయోగిస్తుంది
■ఆన్లైన్ ఓటింగ్
కొన్ని దేశాల్లో ప్రజలు ఆన్లైన్ ఓటు అనుమతి. ఆన్లైన్ ఓటింగ్ను ఉపయోగించిన మొట్టమొదటి దేశాలలో ఎస్టోనియా ఒకటి: ఇది 2005 స్థానిక ఎన్నికలలో మొదట ఉపయోగించబడింది.
■పోస్టల్ ఓటింగ్
అనేక దేశాలు పోస్టల్ ఓటింగ్ ను అనుమతిస్తాయి, ఇక్కడ ఓటర్లు బ్యాలెట్ను పంపించి పోస్ట్ ద్వారా దానిని తిరిగి పొందుతారు.
■నోట
నోటా నన్ ఆఫ్ ది ఎబో అభ్యర్థులు నచ్చని వారు ఓటర్లు ప్రయోగించే అస్త్రం నోటా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈవీఎం మెషిన్లలో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటాను కూడా ఏర్పాటుచేసింది. ఓటరు ఈ బటన్ నొక్కితే ఓటు హక్కును వినియోగించుకున్నట్లే. 2014 ఎన్నికల నుంచి నోటాను అందుబాటులోకి తేసుకోచ్చారు.
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ఇస్తుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి.