హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్/16 జనవరి 2023 :
హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో “ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ మాట్లాడుతూ నేడు చిన్న పిల్లల ఆట వస్తువులు, తినే ఆహార పదార్థాల నుంచి పెద్ద వాళ్ళు వాడే వస్తువులు, వినియోగించే ఆహార పదార్థాల వరకు ఎక్కడ చూసినా మొత్తం కల్తీయే పాలు, నీళ్లు, నూనె, పేస్ట్, కారం, పసుపు, టీ పొడి, ఆఖరికి మనం తినే పండ్లపై కూడా కెమికల్ స్ప్రే చేయడం ఇలా ఒకటేoటి చెప్పుకుంటూ పోతే మనం రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వాడే ప్రతీది కూడా కల్తీయే అంతె కాదు కల్తీ పదార్థాలు వాడినందుకు అనారోగ్యం బారిన పడితె మనం త్వరగా కోలుకొనేoదుకు వాడే మందులు సైతం కల్తీయే గతంలో హైదరాబాద్ లో కల్తీ నూనె, పాల వ్యవహారం బయటకు వచ్చిన సందర్భంగా ప్రజలు ఒక్కసారిగా వామ్మో ఎంత ఘోరం ఎంత పాపం మరి ఇంత అన్యాయమా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్టదా అని లోలోపల కొందరు, బయటకు కొందరు తమ అభిప్రాయాలను తెలిపారు అది కొద్ది రోజుల్లో సద్దుమణిగింది మరలా ఈ మద్య కాలంలో ఖమ్మంలో కల్తీ నూనె, నిన్న యాదాద్రి భువనగిరిలో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు జరిపిన తనిఖీల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది అని గుర్తించారు అంటే కల్తీ రాయుళ్ళు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ చట్టం అన్నా, శిక్షలు అంటే భయం గాని లేక అనుకోకుండా టైమ్ బాగా లేకనో ఏమో గాని అరెస్ట్ అయ్యే అవకాశం వస్తే అధికారంలో ఉన్న పార్టీ నేతల నుంచి కాని వారి అనుచరులు నుంచి గాని ఫలానా వ్యక్తి మన వాడే అని అరెస్ట్ చేయొద్దని ముందుగానే పోలీస్ వారికి చెప్పటం అనివార్య కారణాల వల్ల అరెస్ట్ చేస్తే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులో అధికారులకు , ప్రజాప్రతినిధులకు, లాయర్లకు ఎంతో కొంత మొత్తాన్ని ముట్ట చెప్పి వీలైనంత త్వరగా బయటకు వచ్చి మరొక రూపంలో లేక పోతే అదే రకంగానో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కల్తీ రాయుళ్ళ పై కఠిన చర్యలు గాని, శిక్షలు గాని అమలు చేయకపోవడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మన అందరికి అర్థమవుతోంది. ఇక్కడ నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయో అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ కల్తీ చేయడానికి ముడి సరుకు ఎక్కడ తయారౌతుంది ఎక్కడ నుంచి ఎవరు పంపిణీ చేస్తున్నారు అనేది కనుక్కొని మూలాల మీద దెబ్బ తీస్తే అసలు కల్తీకే తావు ఉండదని కావున ప్రజల్లో సైతం చైతన్యం అవసరం మన పరిసర ప్రాంతాల్లో అసలు ఏమి జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నం కాని అవసరం గాని లేదనే భ్రమలో బ్రతుకు కొనసాగిస్తున్నారు కాని మనం జీవించి ఉన్నంత కాలం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగరూకత కలిగి ఉండాలని “ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినకర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమేశ్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు వీరభద్రం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.