ప్రజల కోసమే, ప్రజలతోనే ఎల్లవేళలా పోలీసులు..
మీ ఓటు స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేల చూడడమే మా బాధ్యత..
చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
మునిసిపల్ ముఖ్య కూడళ్లలో కవాతు నిర్వహించిన కొత్తూరు పోలీసులు..
కవాతులో పాల్గొన్న డీ సీ పి నారాయణరెడ్డి, ఏసిపి రామచంద్రరావు, కొత్తూరు సీఐ శంకర్ రెడ్డి..
హ్యూమన్ రైట్స్ టుడే/కొత్తూరు/నవంబర్ 3:
పోలీసులు ఎల్లవేళలా ప్రజల కోసమే ఉన్నారని, ప్రజలతోనే ఉన్నారని, శుక్రవారం ఏర్పాటుచేసిన కవాతు సందర్భంగా కొత్తూరు సిఐ శంకర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా, నిర్భయంగా ఓటు వేసేందుకు మండలంలోని ముఖ్య కూడళ్లలో కవాతు నిర్వహించామని తెలిపారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని కోరారు. కవాతులో స్థానిక పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై శ్రీనివాస్, సిఐ శంకర్ రెడ్డి, ఏసీబీ రామచంద్రరావు, డి సీ పి నారాయణరెడ్డి పాల్గొన్నారు.