అధికారంలోకి రాగానే గల్ఫ్ పాలసీ ని అమలు చేస్తాం
– పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
– జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టిఫిసిసి ఎన్ అర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ షేక్ చాంద్ పాషా
హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల/ నవంబర్ 03: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్ఫ్ పాలసీని అమలు చేసి తీరుతామని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశం లో అయన మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల, బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని అన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఎన్అర్ఐ పాలసీ అమలు చేసి రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తామని, ప్రత్యేక శాఖ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తామని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా గల్ఫ్ సంక్షేమం కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తానని, బాధిత కుటుంబలకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వడం పట్ల టిపీసిసి ఎన్ అర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ షేక్ చాంద్ పాషా కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల, బాధిత కుటుంబాల సంక్షేమం కొరకు పాటుపడుతామన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం ఉదయం 11:00 గంటలకు పట్టణంలోని ఇందిరా భవన్ కు రావాలని చాంద్ పాషా పిలుపునిచ్చారు.