నామినేషన్ల సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక.
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా/03 నవంబర్ : కేంద్రంలోని మహబూబాబాద్ నియోజకవర్గ సంబంధించిన నామినేషన్లు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరగనున్నవి .అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మరిపెడ తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించనున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ రిటర్నింగ్ అధికారి అలివేలు పోలీస్ అధికారులు ఎన్నికల అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.