అధికార పార్టి ఎమ్మేల్యే ప్రచారానికి.. అడ్డు చెప్పిన కంబాలపల్లి ప్రజలు
గో బ్యాక్ గోబ్యాక్ ఎమ్మేల్యే హరిప్రియ నాయక్
హ్యూమన్ రైట్స్ టుడే/బయ్యారం/03 నవంబర్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం బిఆర్ఎస్ పార్టి ఎమ్మేల్యే అభ్యర్ది బాణోత్ హరిప్రియ ప్రచారానికి కంబాలపల్లి పంచాయితి సర్పంచ్ వట్టం లక్ష్మయ్య, గ్రామ ప్రజలు ప్రచారాన్ని అడ్డకున్నారు. గో బ్యాక్ గోబ్యాక్ ఎమ్మేల్యే హరిప్రియ, మావూరి రావద్దు డౌన్ డౌన్ బిఆర్ఎస్, జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనితో ఎమ్మేల్యే హరిప్రియ నాయక్ సర్పంచ్ ను ఉద్దేశించి అన్నా ఎమైనా ఉంటే చెప్పండి, ఎందుకు గోబ్యాక్, ఎందురకు మీ గ్రమానికి రావద్దు అంటున్నారని గ్రామ ప్రజలను ఎదురు ప్రశ్నంచారు. దీనితో గురువారం ఒక్క రోజు ప్రచార కార్యక్రమంలో ఇసుక మేది, మిర్యాల పెంట, కంబాలపల్లి గ్రామాలలో అధికార పార్టి అభ్యర్ది ప్రచారానికి ఆయా గ్రామ ప్రజలు అడ్డు తగిలి తమ నిరసన తెలియ చేశారు. దీనితో చేసేది ఏమి లేక ఎమ్మేల్యే, అక్కడ నుండి వెళ్లి పోయినట్లు ఆయా గ్రామ ప్రజలు ఆలస్యంగా శుక్రవారం మీడియాకు తెలిపారు. దీనితో మండలంలో అధికార పార్టి ఎమ్మేల్యే హరిప్రియ ప్రచారంను వీడియోలో రూపంలో స్తానిక నాయకులు, ప్రజలు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.