తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30 న జరిగే ఎన్నికలకు దాఖలు చేసే నామినేషన్ మరియు దాని వెంట అభ్యర్థులు జతపరచవలసిన డాక్యుమెంట్ల వివరములు:-
1) శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం 2B. ఉచితంగా సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవ్వబడును.
2) ఒక అభ్యర్థి (4) నామినేషన్ల వరకు వేయవచ్చును.
3) రెండు ఫోటోలు. ఒకటి నామినేషన్ పేపర్ పై మరియు ఒకటి ఫారం – 26 (అఫిడవిట్) పై అంటించుటకు.
4) డిపాజిట్ మొత్తం రూ. 10,000/-లు, షెడ్యూల్ కులము / షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారికి రూ.5,000/-లు, షెడ్యూలు కులము / షెడ్యూలు తెగల వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రము సమర్పించాలి.
5) గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర రాజకీయ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ అదే నియోజకవర్గములోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చును (2B లోని పార్ట్-1).
6) పోటీ చేసేందుకు నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల వారు మరియు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గములోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించవలసి ఉంటుంది (2B లోని పార్ట్-II),
7) ఇతరులు అనగా రిజిష్టర్ / గుర్తింపు పొందని మరియు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని (ఫారం-2B పార్ట్ 111 లోని (C) కాలం ఎదురుగా కేటాయించవలసిన గుర్తులను (EC) పంపిన ఫ్రీ సింబల్స్ నుండి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో వ్రాయవలసి ఉంటుంది.
8) పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గము ఓటరు కానట్లయితే, అతడు ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుండి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకువచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి..
9) ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులు అయి నామినేషన్ పేపర్లో వేలిముద్ర వేసినట్లయితే తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయవలసి ఉంటుంది.
10) ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ముందు తన పేర కొత్త బ్యాంక్ అకౌంట్ ప్రత్యేకంగా తెరువవలసి ఉంటుంది. ఇంతకుముందు తెరచిన బ్యాంక్ అకౌంట్లు అనుమతించబడవు.
11) నామినేషన్ పత్రములోని ప్రతి కాలం తప్పనిసరిగా నింపవలసి ఉంటుంది. ఆ కాలం లో నింపవలసినది లేనట్లయితే లేదు. వర్తించదు అని వ్రాయాలి అంతేకాని డ్యాష్ (-) వంటివి రాయకూడదు. ఏ కాలం కూడా ఖాళీగా వదిలి వేయరాదు.
12) గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర రాజకీయ పార్టీల నుండి రిజిస్టర్డ్ / గుర్తింపు పొందని రాజకీయ పార్టీల వారు ఫారం- A మరియు B ఇంకుసైన్ చేయబడినది తేది: 10-11-2023 మధ్యాహ్నం 3-00 గంటల లోపు (నామినేషన్ వేసే చివరి రోజు) రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
13) భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం-26 నోట రైజ్డ్ అఫిడవిట్ అన్ని కాలములను నింపాలి. ఏదేని కాలములో నింపవలసినది లేనట్లయితే లేదు. వర్తించదు అనేది వ్రాయాలి. అంతేకాని డ్యాష్ (-) వంటివి రాయరాదు. ఏ కాలం కూడా ఖాళీగా వదిలి వేయరాదు.
14) నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపై గల క్రిమినల్ కేసుల వివరములను పార్ట్-IIIA లో తప్పనిసరిగా పేర్కొనాలి.
15) NPDCL నుండి విద్యుత్ కు సంబంధించి, మున్సిపాలిటి / గ్రామ పంచాయితీ నుండి నీటికి సంబంధించి, ప్రభుత్వము కేటాయించిన వసతి గృహము (క్వార్టర్) లో ఉన్నట్లయితే గత (10) సంవత్సరముల నుండి ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రములు సమర్పించాలి.
16) నామినేషన్ వేసే సమయంలోనే రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం. నిర్దేశించిన ప్రతిజ్ఞ / శపథం (తెలుగు / ఆంగ్లము) చేయవలసి ఉంటుంది. ఇట్టి ప్రతిజ్ఞ తనకు నచ్చిన దేవుని పేరు మీద గాని మనస్సాక్షి మీద గాని చేయవచ్చును.
17) రిటర్నింగ్ అధికారి గారికి మీ యొక్క నమూనా సంతకమును (Specimen Signature) ఇవ్వవలెను (ఇది మీ తరపున ఎవరినైనా అనుమతించేందుకు ఉపకరిస్తుంది).
18) అదే విధంగా తెలుగులో మీ పేరు బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ముద్రించవలెనో కూడా పేపర్ మీద వ్రాసి ఇవ్వవలెను.
19) ఈ దిగువ తెలిపిన ప్రతులు / ధృవీకరణలు రిటర్నింగ్ అధికారి నుండి పొందాలి –
i) చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రశీదు.
ii) స్క్రూటినీ కి హాజరయ్యేందుకు నోటీసు..
iii) ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టరు.
iv) కరపత్రములు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, తదితరములు ముద్రించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127 క్రింద సూచనలు:
V) ప్రతిజ్ఞ / శపథం చేసినట్లు ధృవీకరణ పత్రము.
vi) నామినేషన్ పత్రములలోని లోపాలు / ఇంకనూ జతపర్చవలసిన పత్రాల సూచిక చెక్ మె)