ఎన్నికల సందర్బంగా మండలంలో కేంద్ర బలగాలతో పోలీసు కవాతు : ఎస్ఐ ఉపేందర్
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ /28 అక్టోబర్ 23: మహబూబాబాద్ జిల్లా బయ్యారం స్థానిక మండలంలోని కొత్తపేట బయ్యారం బస్టాండ్ సెంటర్ లో ఎన్నికల సందర్బంగా ఎస్ఐ ఉపేందర్ ఆద్వర్యంలో కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ ఆదేశాను సారంగా సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతకంగా నిర్వహనకు పోలీసు కేంద్ర పారామిలటరీ, సిఆర్పిఎఫ్ ఇతర బలగాలు వచ్చినట్లు తెలిపారు. అదే విదంగా బయ్యారం– ఇల్లందు ప్రధాన రహాదారిపై కొతపేట బయ్యారంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐ వెంకన్న , ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.