హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /అక్టోబర్ 11:
తెలంగాణలో అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27 న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది*
సింగరేణి ఎన్నికలు ఆరు జిల్లాల్లో జరగనుండగా,ఇందులో 3 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం ఉంది. అసెoబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలకు నిర్వహణ కష్టం అవుతుంది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీ లు కూడా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.
సింగరేణికి సంబంధించిన 6 జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు.కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం అని ఏఏజీ రామచంద్రరావు అన్నారు.
గత అక్టోబర్ నుంచి సింగరేణి యాజమాన్యం వాయిదా అడుగుతూనే ఉంది. 43 వేల మంది ఓటర్ల జాబితా ఆల్రెడీ రెడీ అయ్యింది. ఇప్పటికే. చాలా సార్లు వాయిదా అడిగారని,కేంద్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించడం జరిగింది.
వాదనలన్నింటినీ విన్న హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబర్ 27న తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.