పాకిస్తాన్ వరుసగా రెండో విజయం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /అక్టోబర్ 11:
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.

మంగళవారం ఉప్పల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా, శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ నిశా ంక ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ సదిర సమరవిక్రమ తమపై వేసుకున్నారు.

ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ 77 బంతుల్లోనే 14 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేశాడు.

మరోవైపు సమరవిక్రమ 89 బంతుల్లో 11 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 108 పరుగులు సాధించాడు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్ అబ్దుల్లా షఫిక్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు ఆదుకున్నారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్‌లో కూడా విఫలమయ్యారు.

అయితే షఫిక్, రిజ్వాన్ లు అసాధారణ బ్యాటింగ్‌తో పాక్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించారు. షపిక్ పది ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన రిజ్వాన్ 121 బతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 131 పరుగులు సాధించాడు.

దీంతో పాక్ 48.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment