హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపెల్లి జిల్లా/అక్టోబర్ 11:
మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల రాజామణి అనే వివాహిత హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, వివారాల్లోకి వెళితే..
మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల రాజమణి అనే వివాహిత భర్త చనిపోవడంతో మంథని లోని ఎరుకల గూడెంలో నివాసం ఉంటుంది,
కొంతకాలంగా పైడాకుల సంతోష్ అనే వ్యక్తితో ఈమెకు పరిచయం ఏర్పడడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంతోష్ కొన్ని రోజులుగా ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది,
దీనిలో భాగంగా సోమవారము రాత్రే రాజమణి గొంతు కోసి హతమార్చిన సంతోష్ గదికి తలుపులు పెట్టి పారిపోయాడు, రెండు రోజులుగా ఆమె ఫోను లిఫ్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కొడుకు మంగళవారం మధ్యాహ్నం గది తలుపులు తీయగా ఆమె హత్యకు గురైనట్లు తెలిసింది,
ఆమె కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది.