హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /అక్టోబర్ 09:
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత ఎన్నికల సంఘం అధికారులు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
కాగా, గత నెల రోజులుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న సీఈసీ.. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే అత్యంత కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సీఈసీ నిర్ణయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.