హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 09:
అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది.చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను సోమవారం కొట్టివేసింది.
మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్, అంగళ్లు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం తీర్పును వెలువరించారు.
చంద్రబాబు జైలు నుంచి విడుదలవుతారా? లేదా? అనే దానిపై రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి.
ఇక ఏసీబీ కోర్టు విషయానికి వస్తే.. లంచ్ తర్వాతే చంద్రబాబు బెయిల్, కస్టడీపై తీర్పు వెలువడనుంది. లంచ్ తర్వాత రెండు పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది.