హ్యూమన్ రైట్స్ టుడే/ఇజ్రాయిల్ /అక్టోబర్ 09:
ఓ వైపు ఏడాదిన్నరకు పైగా రష్యా.. ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హమాస్ హఠాత్తుగా ఇజ్రాయిల్ పై హఠాత్తుగా దాడి చేసి.. మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేపినట్లు అయింది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్లకు ప్రతిగా ఇజ్రాయిల్ కూడా భారీ బాంబు దాడులకు పాల్పడుతోంది.
ఇంతలో అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. అమెరికా తన ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను సిద్ధంగా ఉండాలని.. ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి తూర్పు మధ్య ధరా సముద్రానికి వెళ్లాలని ఆదేశించింది.
PTI నివేదిక ప్రకారం పాలస్తీనాపై యుద్ధంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తమ యుద్ధనౌకలను కోరారు. యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కు చెందిన సుమారు 5,000 మంది నేవీ సిబ్బందితో పాటు యుద్ధ విమానాలు, క్రూయిజర్‌లు, డిస్ట్రాయర్‌లను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
అమెరికా వైపు నుండి ఇజ్రాయెల్‌కు యుద్ధనౌకను పంపడం వెనుక ప్రధాన కారణం హమాస్‌కు అందుతున్న అదనపు ఆయుధాల సరుకులను ఆపివేయడమే నని అమెరికా ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం మాట్లాడుతూ గాజా ప్రాంతంలో కొనసాగుతున్న భీకర యుద్ధంపైనే తన దృష్టి అంతా ఉందని, హమాస్ యోధులు స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని ఇజ్రాయెల్ తిరిగి పొందడంలో సహాయపడుతుందని అన్నారు.
ఇజ్రాయెల్‌తో పాటు దానికి మద్దతిచ్చే వారందరికీ ఇది పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకోవాలి కూడానని చెప్పారు.
ఏళ్ల తర్వాత తెరవబడిన ఈజిప్షియన్ పిరమిడ్.. అనేక రహస్యాలు వెల్లడవుతాయని విశ్వాసం..
గాజా స్ట్రిప్‌లో నేలమట్టం అవుతున్న భవనాలు
తమపై హమాస్ యోధులు చేసిన దాడికి ఇజ్రాయెల్ సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు.
గాజాలోని అనేక భవనాలను ధ్వంసం చేశారు. హమాస్ దాడుల్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ భారీ నష్టాన్ని చవిచూసింది. మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 600 దాటింది, 2000 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో, గాజా స్ట్రిప్‌లో 300 మందికి పైగా మరణించినట్లు వార్తలు వచ్చాయి. హమాస్ ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్‌లను కూడా బందీలుగా చేసుకున్నారు.