హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట జిల్లా/అక్టోబర్ 09:
వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ సాధనకై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం చేస్తాం సూర్యాపేట జిల్లా చివ్వెం మండలం గుంపుల వద్ద ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి పై సోమవారం రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ..
వికలాంగుల హక్కుల సాధనకై పోరాటం చేస్తున్న తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని అయన స్పష్టం చేశారు.వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ సాధనకై దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.
76 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమైన వికలాంగుల సమాజానికి చట్టసభల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఏండ్ల తరబడి సకలంగుల పాలనలో అణచివేతకు గురై అవ మానాలు ఎదుర్కొంటు దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో గళం వినిపించే నాయకులే లేకపోవడం దురదృష్టకరమన్నారు.
దేశంలో రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కుంటుబడిందని వికలాంగుల సమాజాన్ని కేవలం పెన్షన్ కే పరిమితం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు రాజకీయ పార్టీలు వాడుకుంటు వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నాయని, సంక్షేమ పథకాల్లోనూ ప్రభుత్వ నియామకాల్లోను పార్టీల పదవుల్లోనూ వికలాంగుల సమాజానికి 76 ఏళ్ల నుంచి అవమానాలు అణిచివేతలు తప్పితే నిజమైన సామాజిక న్యాయం జరగలేదని వికలాంగులకు సామాజిక న్యాయం జరగాలంటే చట్టసభల్లో వికలాంగుల జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం దక్కాల్సిందేనని రాజేష్ హెచ్చరించారు.
రాజ్యాధికార సాధనకై దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై తమ పోరాటం ఆగబోదని హక్కుల సాధనకై పోరాటం చేస్తున్న తమని అక్రమ అరెస్టులు ఏమీ చేయలేవని త్వరలోనే వరంగల్ జిల్లా కేంద్రంగా వందలాదిమంది వికలాంగులతో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, జిల్లా నాయకులు మున్న మధు యాదవ్ ఆత్మకూరు, మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదరమోహన్, రెడ్డి సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.