స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చంద్రబాబుకు సిఐడి ప్రశ్నల వర్షం
హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ/సెప్టెంబర్ 09:
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు.
ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నా పోలీసులు సుమారు తొమ్మిది గంటల ప్రయాణం అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
ఇవాళ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు.. చంద్రబాబును విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో నిధులు మళ్లింపుపై దాదాపు గంటకు పైగా అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, విచారణ అనంతరం మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీలో కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.