నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్ హాల్‌టికెట్లు.. ఈ నెల 15న పరీక్ష
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 09:
టీఎస్ టెట్ హాల్‌టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈనెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
టెట్‌కు 20 శాతం వెయిటీ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు.