రూ.50 వేలకు ఇద్దరు కూతుర్లను అమ్మకానికి పెట్టిన కన్న తల్లి
హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి /సెప్టెంబర్ 07:
తెలంగాణలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో కన్నతల్లి కూతుర్లను అమ్మకానికి పెట్టింది. ఓ కన్నతల్లి రూ.20 వేలకు మూడ్రోజుల పసికందును రూ.30 వేలకు ఏడేళ్ల పాపను అమ్మాకానికి పెట్టింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఐసీడీఎస్ అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం.
అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో డబ్బుల కోసం కూతుర్లను విక్రయించినట్లు సమాచారం. ఐసీడీఎస్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, గతకొంత కాలంగా మండలంలో చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నా.. బాలల సంరక్షణ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పేదరికంతో కూతుర్లను విక్రయింస్తున్న కుటుంబాల వివరాలు తెలుసుకొని ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.