హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 07:
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్టలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అడ్డగుట్టలో ఓ బిల్డింగ్ నిర్మాణం వద్ద పనిచేస్తున్న క్రమంలో నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో ఒకవైపు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు సోనీ, సంతోష్ అనే ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.