పెద్దపల్లిలో జిల్లా లో టిఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లేఖ
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/సెప్టెంబర్ 06:
పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, భూషనవేని శ్రీనివాస్, శ్రీరాములు గోపాల్‌కు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో హెచ్చరించారు.
దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని మావోయిస్టు నేత వెంకటేష్ పేరిట లేఖ విడుదల అయ్యాయి.
30 మందికి పైగా ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మించి నిరుద్యోగులుగా ఉన్న యువత నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి దగ్గర 4 నుంచి 6 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించలేదు. ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించి మోసం చేయడంతో బాధితులు డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగితే నాయకులంతా ప్రభుత్వ అండదండలతో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. పోలీసులతో, రాజకీయ నాయకులతో బెదిరిస్తున్నారు.
డబ్బులు వాపస్ ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకున్న వాళ్లు దిక్కులేని వాళ్లు అయ్యారు. ఆర్ఎఫ్ఎల్ బాధ్యులు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఈ ముగ్గురు భూ కబ్జాలు చేస్తూ ప్రజల మధ్య తగాదాలు సృష్టించి డబ్బులు తీసుకొని పంచాయితీలు చేయడం, వినని వారిపై కేసులు పెట్టించడం, ఇద్దరి మధ్య ఒప్పందం చేయించి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది.
గ్రామంలో దళితులపై సమస్యలు సృష్టించి వారిని కొట్టించారు. తిరిగి పోలీసులకు చెప్పి గ్రామాన్ని దిగ్భందించి దళితులను తీసుకెళ్లి 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెట్టి ఉల్టా కేసులు పెట్టించారు.
ఈ ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు. గుండాయిజం, భూతగాదాలు, పంచాయితీలు చేయడం మానుకోవాలి, దళితులపై కేసులు ఉపసంహరించుకోని, వారికి క్షమాపనలు చెప్పాలి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని లేఖలో పేర్కొన్నారు.