హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 06:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సముదాయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రారంభించారు.
సచివాలయం ఉద్యోగులకు బ్యాంక్ ఉత్తమ సేవలు అందించేందుకు బ్యాంక్ అధికారులు కృషి చేయాలని సీఎస్ కోరారు. బ్యాంక్ అధికారులతో కలసి సీఎస్ స్ట్రాంగ్ రూమ్, కంప్యూటర్ సెంటర్‌ను పరిశీలించారు.
ప్రస్తుతం బీఆర్‌కే భవన్‌లో సేవలు అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్ బుధవారం నుంచి నూతన కార్యాలయం ద్వారా సేవలు కొనసాగిస్తుందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు.
బ్యాంక్ అధికారులు, సిబ్బందికి సీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కర్ రావు, రీజినల్ హెడ్ కె శ్రీధర్ బాబు, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వీ విజయ్ కుమార్, మేనేజర్ అనూష, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.