చేగుంట మెదక్ రోడ్డులో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు

Get real time updates directly on you device, subscribe now.

సిద్దిపేట నుంచి తిరుపతి కి రైళ్లు ప్రారంభించాలి : మంత్రి హరీష్‌రావు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/సెప్టెంబర్ 06:
సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూర్‌కు రైళ్లు ప్రారంభించడంతో పాటు, సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం ను కోరారు.

బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో రైల్వే పెండింగ్ పనుల అంశంపై సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను కలిశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్ ఈ నెల 15 న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్‌స్పెక్షన్‌ పూర్తి కాగానే ప్యాసింజర్ రైళ్ల ను, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పుష్‌పుల్‌ రైల్ ను ప్రారంభించాలన్నారు. పఠాన్ చెరు ఎదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

*ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణతోనే సిద్దిపేట ప్రాజెక్ట్ విజయవంతం*

మాసాయిపెట్ రైల్వే పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి రైల్వే శాఖకు ఇవ్వడం వల్లే సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయ్యిందని అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపధ్యంలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ ను మెదక్ ,సిద్దిపేట మీదుగా నిర్మించాలన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ తోనే సిద్దిపేట ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

చేగుంట మెదక్ రోడ్డు లో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీఎం ను కోరారు. అన్ని విజ్ఞప్తిలపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ మంత్రి, ఎంపీ చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment