వైఎస్ షర్మిల ఎమ్మెల్సీ కవితకు లేఖ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖ రాశారు.
మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి. మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదు.
నా అభిప్రాయంతో పాటు, ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా కూడా పంపుతున్న. జాబితాతో పాటు ఒక కాలిక్యులేటర్ లింక్ కూడా పంపిస్తున్నా.
బీఆర్‌ఎస్ జాబితా చూసి 33 శాతం ఇచ్చారా? లేదా? లెక్కించండి. మద్దతు కూడగట్టే ముందు మీ తండ్రితో ఈ విషయం చర్చ చేయాలని మనవి’’ అంటూ షర్మిల లేఖలో పేర్కొన్నారు.