రేపు విధుల బహిష్కరణకు హోంగార్డుల పిలుపు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
విధుల బహిష్కరణకు హోంగార్డుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి గురువారం నుంచి విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జాక్ పిలుపునిచ్చింది. మరోవైపు హోంగార్డ్ రవీందర్‌కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో హోంగార్డులంతా ఉస్మానియా ఆస్పత్రికి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున్న హోంగార్డులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హోంగార్డు జేఏసీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ..
హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంపై వెంటనే ప్రభుత్వo స్పందించాలని డిమాండ్ చేశారు. రవీందర్ బ్రతకడం చాలా కష్టమన్నారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల విధులు బహిష్కరణకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని.. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నానరు.
తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధులు బహిష్కరిస్తామన్నారు. రేపటి నుంచి హోంగార్డులు ఎవ్వరు విధుల్లో ఉండకూడదని నారాయణ తెలిపారు.