రాయదుర్గం ఎస్సై రాజేందర్ సస్పెండ్..రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
రాయదుర్గం డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఎస్సై రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి కోర్టు రాజేందర్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారించనున్నారు. కాగా..
భారీగా డ్రగ్స్ అమ్ముతూ నార్కొటిక్ బ్యూరో టీమ్‌కు రాజేందర్ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే. అతని వద్ద నుంచి నుంచి 1 కిలో 700 గ్రాముల డ్రగ్స్‌ను నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. అలాగే రాజేందర్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.