ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్… రాష్ట్ర వ్యాప్తంగా అమలు?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నషన్ అటెండెన్స్ ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ విధానం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు అమలు చేయనున్నారు.
అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నషన్ అటెండెన్స్ తీసుకోనున్నారు. ఇక ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థుల అటెండెన్స్ అంతా ఫేషియల్ రికగ్నషన్‌లోకి మారనుంది.
ముందస్తుగా మొదటి దశలో విద్యార్థులకు అమలు చేశాక, తర్వాత టీచర్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 10 జిల్లాలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలులో ఉన్నది.
ఫేషియల్ రికగ్నషన్ అటెండెన్స్ విద్యార్థులకు విజయవంతంగా అమలు చేశాక, బయోమెట్రిక్ స్థానంలో ఉపాధ్యాయులకు సైతం షేషియల్ రికగ్నషన్ అటెండెన్స్‌ను అమలు చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.