నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 06:
తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. దీనికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా హాజరయ్యారు.
రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకి చేరుకోనుంది. నేడు తుది నివేదిక రూపొందించడం జరగనుంది. సాయంత్రం సీల్డ్ కవర్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ నివేదికను అందించనుంది. ఇప్పటికే దాదాపు 30 మంది సభ్యులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల విషయమై కసరత్తు చేస్తోంది.
త్వరలోనే అన్ని నియో జకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ వెలువరించనుంది.