నల్గొండ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యా యత్నం
హ్యూమన్ రైట్స్ టుడే/నల్లగొండ జిల్లా/సెప్టెంబర్ 06:
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు ఇద్దరు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా, నక్కలపల్లి గ్రామానికి శివాని లు రాంనగర్ రాజీవ్ పార్క్ లో గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.
స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, యువతుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.