ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష వాయిదా వేసిన బోర్డు?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో భర్తీ కోసం కోసం నిర్వహించనున్న ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 11వ తేదీన జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఈ పరీక్షను తిరిగి నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వైబ్ సైట్‌లో అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.