రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ సెప్టెంబర్ 06:
హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సంచలనం చోటుచేసుకొన్నది.
అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది. ఆ వివరాలను హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ప్రకటించారు.
మొత్తంగా ఆర్టీఏ ఖాజానాకు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు. టీఎస్11ఈజడ్ 9999 నెంబర్‌ను రూ.9,99,999కు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకున్నదని తెలిపారు.
టీఎస్11ఎఫ్‌ఏ 0001 నంబర్‌ను 3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకొన్నాడని పేర్కొన్నారు. అదే సిరీస్‌తో 0011 నంబర్‌ను శ్యామల రోహిత్‌రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకొన్నారని తెలిపారు.