తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం

Get real time updates directly on you device, subscribe now.

రూ.700 కోట్లతో నాఫ్‌కో సంస్థ తెలంగాణలోభారీ పెట్టుబడులు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌ /సెప్టెంబర్ 06:
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికా టూర్‌ను ముగించుకొని దుబాయ్‌ పర్యటనను మొదలు పెట్టిన మంత్రి కేటీఆర్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్‌ తన దుబాయి పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్‌కో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్‌ అల్‌ ఖతిబ్‌ ప్రతినిధి బృందం సమావేశమైంది.

అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.700 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది.

తెలంగాణతోపాటు దేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్‌కో తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment