ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ :పోలీసుల సూచన
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 05:
నగరంలో వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక కీలక సూచన చేశారు. కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతా జలమయంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది.
ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వర్షాల కారణంగా ట్రాఫిక్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపిక చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు సూచించారు.
నగరంలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఎంపిక చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదు,అని సైబరాబాద్ పోలీస్ లు ట్విటర్ వేదికగా సూచించారు.