హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ /సెప్టెంబర్ 03: కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుని జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న కూడా జ్వరంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపితో కలిసి ఆమె సమావేశాల్లో పాల్గన్నారు.