హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/16 జనవరి 2023: గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తార్నాకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఈరోజు(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దంపతులు, నాలుగేళ్ల బాలిక సహా మరో మహిళ కూడా ఉన్నారు.
మృతులు ప్రతాప్(34), సింధూర(32), ఆద్య(4), ప్రతాప్ తల్లిగా గుర్తించారు. తొలుత నాలుగేళ్ల చిన్నారి ఆద్యకు ఉరివేసి ఆపై కుటుంబం అంతా ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కార్ షోరూమ్‌లో ప్రతాప్ డిజైనర్ మేనేజర్‌గా పని చేస్తుండగా, హిమయత్‌నగర్‌లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా సింధూర పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.