స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా?పోలీస్ ల మెరుపు దాడులు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 02:
నగరంలోని పలు స్పాలు, మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ మెరుపు దాడులు చేశారు శనివారం హైదరాబాద్‌లోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది.
సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా నడపడం, స్పా ముసుగులో వ్యభిచారం, క్రాస్ మసాజ్‌లకు మసాజ్ సెంటర్లు పాల్పడుతున్నాయనే సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు.
సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్ లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై కేసులు నమోదు అయ్యాయి.
ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను యాంటీ ట్రాఫికింగ్ సెల్ రెస్క్యూ చేసింది. స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా నడుపుతున్న నిర్వాహకులపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ కేసులు నమోదు చేసింది.