నిజామాబాద్‌జిల్లా సీపీగా సత్యనారాయణ నియామకం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబరు 02:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా వి. సత్యనారాయణ నియమితులయ్యారు. రాచకొండ కమిషనరేట్‌లో జాయింట్ సీపీగా ఉన్న సత్యనారాయణను ప్రభుత్వం నిజామాబాద్ సీపీగా బదిలీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం సాయంత్రమే ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది నుంచి నిజామాబాద్ సీపీ పోస్టు ఖాళీగానే ఉంది.
నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ సీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి సీపీని నియమించింది.