నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ అభ్యర్థికి అభినందనల వెల్లువ..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/సెప్టెంబర్ 01:
ఆల్ ఇండియ జైహింద్ పార్టి నుండి నిజామామాబాద్ రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది బాలరాజునాయక్ పేరును ఆపార్టి అధిష్ఠానం ప్రకటించడంతో శుక్రవారం రోజున సహచర న్యాయవాదులు, స్నేహితులు, ఉద్యోగస్తులు, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా సహచర న్యాయవాది రాజు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం నుండి యువనాయకుడిగా బాలరాజు నాయక్ బరిలో దిగడం రూరల్ నియోజక వర్గ ప్రజల అదృష్టం అని అన్నారు. బాలరాజు నాయక్ కు సీనియర్ న్యాయవాదిగా, న్యాయ కళాశాల లెక్చరర్ గా, నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ కు రెండు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికై జాయింట్ సెక్రేటరీగా, జిల్లా గ్రంథాలయ సెక్రేటరీగా సేవలు చేసి గ్రంథాలయానికి వన్నె తెచ్చి అందరి మన్ననలు పొందినారని, అలాగే జిల్లా న్యాయ సేవాదికార సంస్థలో చురుకుగా పని చేసి గ్రామ స్థాయిలో ప్రజలకు న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి చైతన్యం చేసి జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం జరిగిందని అన్నారు.
సమాజంలో వెనుకబడిన BC SC,ST,మైనారిటీ ప్రజలందరి అభివృద్ధిని ఆశించే వ్యక్తి బాలరాజు నాయక్ అని అన్నారు. దేశంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా లో మూడు పర్యాయములు ఫోరం.ఫర్ .ఆర్.టి. ఐ సంస్థ కు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికై అవినీతి పై రాజీలేని పోరాటం చేస్తు ప్రజలకు న్యాయం జరిగేలా,ప్రభుత్వ తీరును ఎప్పటి కప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ఏకైక వ్యక్తి బాలరాజు నాయక్ అని తెలిపారు.
ఇలాంటి యువ మేధావిని ఆల్ ఇండియ జైహింద్ పార్టి గుర్తించి ఆయన సేవలు నేటి తరానికి అందించాలని రాజకీయంగా రానించడం స్వాగ తించవలసిన విషయం అని గుర్తు కొనియాడినారు. రూరల్ నియోజక వర్గ రైతులు, కార్మికులు, మహిళా మణులు, యువకులు, అందరు బాలరాజు నాయక్ నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీమాన్, చరన్ కుమార్, రంజిత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.