భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి
హ్యూమన్ రైట్స్ టుడే/ఆదిలాబాద్ జిల్లా/సెప్టెంబర్ 01:
జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్, నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.అదికాస్తా విషమించడంతో దీపను హత్యచేశాడు.
అనంతరం తన బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో మమత జిన్నింగ్ మిల్లు ఎదుట ఆగిఉన్న లారిని వెనుక నుంచి ఢీకొట్టాడు.దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్ అక్కడికక్కడే చనిపోయినాడు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.