శీర్షిక : మా అమ్మకు స్వాగతం.
తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ
ప్రవేశః సంక్రాంతిః –
పుష్యమాసాన ,హేమంత ఋతువున,
శీతగాలులు వీస్తూ మంచు కురుస్తూ పుడమి
శ్వేత వర్ణం పరుచుకునే వేళ.
సూర్యు భగవానుడు. మకరరాశిలోకి ప్రవేశించే శుభగడియల్లో …
అతివలందరూ తమ ఇళ్ళ ముంగిళ్ళను
రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తూ
ముగ్గులతో స్వాగతిస్తుంటే కదిలివస్తుంది
మా సంక్రాంతి లక్ష్మి..!
చేతికి వచ్చేన పంటను దైవానికే సమర్పిస్తూ
నవధాన్యాలను గొబ్బెమ్మలలో కొలువుదీర్చి
స్వాగతించే అతివల కొరికలు తీర్చగా
కొంగు బంగారం చేస్తూ కదలి వస్తుంది
మా సంక్రాంతి లక్ష్మి..!
తెలుగింటి ఆడపడుచులు
గొబ్బెమ్మ పాటలు పాడుతూ స్వాగతం పలకగా అష్టలక్ష్ములతో వచ్చేసింది మా సంక్రాంతి లక్ష్మి..!
అరిసెలు చకినాల పిండి వంటల సువాసనలు వెదజల్లుతూ స్వాగతం పలకగా
వచ్చేసింది సంక్రాంతి లక్ష్మి..!
ఆప్యాయతానురాగాలు సుమ గంధాలై
పరిమళించే వేళ తీరొక్క పిండి వంటలతో కొలువు
తీరిన సౌభాగ్య లక్ష్మిని స్తుతించగా ముదమారగా వచ్చేస్తుంది సంక్రాంతి లక్ష్మి..!
గంగిరెద్దులు నృత్యాల్లో ముంగిళ్ళు శోభాయమానంగా హరిదాసు కీర్తనలతో భక్తి పారవశ్యం మిన్నంటగా
కదలి వస్తుంది కరుణించే సంక్రాంతి లక్ష్మి..!
నింగిలోని హరివిల్లుతో పోటీ పడుతున్నా
పతంగులతో కనువిందు చేస్తూ స్వాగతం
పలకగా వచ్చేసింది మా సిరుల
సౌభాగ్య సంక్రాంతి లక్ష్మి..!
పసిడి ధాన్యపు రాశులు నట్టింట కనువిందు
చేస్తూ స్వాగతం పలకగా వచ్చేసింది సంక్రాంతి లక్ష్మి..!
పసుపు కుంకుమలతో పూలమాలతో ముస్తాబై
గోమాతలు స్వాగతించగా వచ్చేసింది సంక్రాంతి లక్ష్మి..!
కష్టాలను దూరం చేస్తు.సౌభాగ్య సిరులతో
నట్టింట కొలువు తీరుగా వచ్చింది మా సంక్రాంతి లక్ష్మి.
మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకు,
మీ ఆత్మీయులకు ,శ్రేయోభిలాషులకు, మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు (2023)🙏
రచన
మంజుల పత్తిపాటి (కవయిత్రి )
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
బ్రాహ్మణ సేవా వాహిని
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు.