సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 01:
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.
టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ బదిలీ ప్రక్రియలో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు.