డిజెఎఫ్ మిత్రులకు స్వాగతం..సుస్వాగతం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 31: అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలనే లక్ష్యంతో వచ్చే ఆదివారం 3.09.2023 నాడు వరంగల్‌లో డిజెఎఫ్ ఆధ్వర్యంలో ‘జర్నలిస్టుల గర్జన’ సభ జరగనున్నది. ఈ సభకు డిజెఎఫ్ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మిత్రులారా..ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజెఎఫ్ జిల్లా, మండల నాయకులు, సభ్యులు తప్పక హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా డిజెఎఫ్ సభ్యులకు డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర, వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ పక్షనా పేరు పేరునా ఆహ్వానం పలుకుతున్నాం.
……………………………………….
సమయం: ఉదయం 10.30 గంటల నుంచి
వేదిక: బవార్చి హోటల్, పోశమ్మ మైదాన్ వరంగల్:
తేదీ:ఆదివారం 3.09.2023
………………………………………….
అభినందనలతో
మాసం రత్నాకర్ పటేల్
డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
……………………….
కొంతం యాదిరెడ్డి
డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
………………………