రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు..

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది :రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు


హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఆగస్టు 31:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది.

తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సూచనలు చేస్తున్నారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రేపటి నుండి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

వికలాంగులు, వృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ తేదీ కంటే మూడు రోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల ఇంటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకువెళ్లి వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment