పద్మజివాడి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై..
హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి జిల్లా/ఆగస్టు 31:
కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండలంలోని పద్మజివాడి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైంది.
నిజామాబాద్ పట్టణానికి చెందిన కారు మెకానిక్ కారులో నిజామాబాద్ నుండి కామారెడ్డి వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న అతని స్నేహితుడు వెంటనే కారు దిగిపోయారు.
ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన స్థలానికి ఎస్ఐ రాజు చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసారు.