హ్యూమన్ రైట్స్ టుడే/సంగారెడ్డి/16 జనవరి 2023: సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు. ఎక్స్ గ్రేషియా రావాలంటే 50 వేలు డిమాండ్ చేశాడు. 5 నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులను తిప్పుకున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయిన బాధితులు చివరికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు కలెక్టర్ చెంతకు వెళ్లారు. నేడు బాధితురాలి తల్లి సంగారెడ్డి కలెక్టర్ శరత్‌తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం కోహిర్ (మం) వెంకటాపూర్‌లో ఐదేళ్ల దళిత బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో 6 నెలల క్రితం రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారి సత్యంను కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాధితురాలి తల్లికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.