రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి

Get real time updates directly on you device, subscribe now.

*వీఓఏలకు తెలంగాణ సర్కారు గౌరవ వేతనం పెంపు!!*

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఆగస్టు 31:
వీఓఏలకు తెలంగాణ సర్కారు రాఖీ పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. వీఓఏలకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3,900 నుంచి రూ.5వేలకు వేతనాన్ని పెంచింది. అదనపు సాయం రూ.3వేలతో కలిపి నెలకు రూ.8వేలను వీఓఏలు అందుకోనున్నారు.

ఈ మేరకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment