చట్టాలను ఉల్లంగిస్తున్న పోలీసులకు శిక్ష తప్పదు: అడ్వకేట్ మద్దిరాల

Get real time updates directly on you device, subscribe now.

చట్టం పోలీస్ చుట్టమా….!?

ప్రశ్నిస్తున్న అడ్వకేట్ మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి

చట్టాలను ఉల్లంగిస్తున్న పోలీసులకు శిక్ష తప్పదు అంటున్న అడ్వకేట్ మద్దిరాల…!

నిజమైన కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ చెయ్యరు అంటున్న మద్దిరాల…!

కోర్టు ఆదేశాలను సైతం పాటించరా అంటూ ప్రశ్న..!?

రజాకర్ల పోకడలతో పోలీసింగ్ చేస్తారా..? అంటున్న మద్దిరాల…!

జర్నలిజాన్ని కాలరాసే యత్నంలో ఉన్న ఎస్సైపై యంత్రాంగం చర్యలు ఉండాలి…!

పేరుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో అరాచక పోలీసింగాఅంటే ఎలా..? అంటున్న మద్దిరాల…!

పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే సామాన్యుడు గజగజ వణికిపోతున్నాడంటున్న మద్దిరాల..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 26:
వివరాల్లోకి వెళితే : నిత్య గమనం వనపర్తి జిల్లా ప్రతినిధి : వనపర్తి జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్లలో బ్రిటిష్ కాలం చట్టాలను, రజాకర్ల పాలనను సామాన్యుడిపై ప్రయోగించడంతోపాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తే…! ఏరా అనే పదం నుంచి రాయటానికి వీలులేని పదజాలం వాడుతూ చెప్పుకోవటానికి వీలు లేనటువంటి మాటలతో విచ్చలవిడిగా భాషను ఉపయోగిస్తూ ఓ సామాన్యుడు, మరో మధ్యతరగతి వారు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎందుకు వచ్చామా…!? ఈ నరక కూపంలోకి అనేటువంటి పరిస్థితులను చవిచూపిస్తూ నరకం అనుభవిస్తున్నారని, మనల్ని మనం కించపరచుకునేల ఉంటుందని ఫిర్యాదుదారులు వాపోయినప్పుడు చాలా బాధిస్తుందని, కనీసం ఒక్క అధికారిపై చర్యలు తీసుకుంటే ఆ జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అనేక కేసుల్లో రాజకీయ పలుకుబడి లేదా లంచం విపరీతమైన ప్రభావం చూపుతాయని అవి లేని సామాన్యుడు ఫిర్యాదు చేస్తే స్వీకరించకపోగా..! డబ్బున్నోడితో పలుకుబడి ఉన్నవాడితో ఎందుకు పెట్టుకుంటారని ఎదురు మాట్లాడకుండా వెళ్లి వారితో కాంప్రమైజ్ కావాలని లేని పక్షంలో మీ పైన కేసులు కడతామని బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితుల గురించి ఫిర్యాదుదారులు చర్చించినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని జులుం ప్రవర్తించే వారిపై కఠిన చర్యలకు సైతం పడేలా మన రాజ్యాంగం ఉందని ఎవరు దాన్ని వినియోగించుకోవడం లేదని ప్రతి వ్యక్తి భయంతో వెనకడుగులు వేస్తారే తప్ప ముందుకు వచ్చేవాళ్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటారని అలా జర్నలిస్ట్ చిరంజీవి అను హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ముందుకు రావడంతో పెబ్బేరు ఎస్సై జగదీశ్వర్ చేసిన ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయని ఇలా నిజమైన బాధితులు సరియైన అడ్వకేట్ ని సంప్రదించి కోర్టును ఆశ్రయిస్తే వారికి 100% న్యాయం జరిగే అవకాశం ఉందని, కొంత సమయం వెచ్చించినప్పటికీ చివరికి న్యాయం గెలిచే అవకాశాలు ఉన్నాయని అడ్వకేట్ మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అను హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సమస్యలపై కోర్టుల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే చాలావరకు ఏ విధమైన రాజకీయ, ఆర్థిక పలుకుబడి లేని వారివే ఎక్కువగా ఉన్నాయని వారికి జరిగిన అన్యాయం కళ్లకు కనిపించినట్టుగా ఆధారాలున్నప్పటికీ, కేవలం పలుకుబడితోనే వారికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని కావున ప్రజలు, బాధితులు సీగ్ర ఉపశమనం ఆశించకుండా న్యాయం ఆశించి వచ్చినట్లయితే 100% మన చట్టాల ద్వారా న్యాయం పొందవచ్చు అని తెలిపారు.

ఓ ఇద్దరు జర్నలిస్టులపై దాదాపు 30 మంది ఇసుక మాఫియాతో ఎస్సై జతకట్టి దాడి చేయిస్తే ఆ వ్యక్తులపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వారితో జత కట్టిన ఎస్సై జగదీశ్వర్ దెబ్బలు తిన్న ఇద్దరు జర్నలిస్టులపైనే మొదట కేసు కట్టి బెదిరింపులకు పాల్పడ్డ విషయంపై నెల 15 రోజుల నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదంటే ఏ విధంగా ఊహించాలి అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో కోర్టును మాత్రమే ఆశ్రయించక వేరే మార్గం కనిపించలేదు. కావున బాధితులు ఎవరైనా ఉన్నతాధికార యంత్రాంగానికి విషయం తెలిపి వెంటనే కోర్టులో ప్రైవేటు కేసులు దాఖలు చేసినట్లయితే పరిష్కార మార్గం సుగమమవుతుందని, అవి పాటించని క్రమంలో ఆ అధికారులపై సైతం కోర్టులు వేటు వేసే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని, కావున బాధితులు సరైన మార్గం ఎంచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment