రేపు ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 26:
రేపు 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండేది. కానీ, సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చేపట్టారు. కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది.


తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా… అమిత్ షా టూర్ ఖరారైంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ సభతోనే ఎన్నికల యుద్ధంలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆగస్టు 27వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 3 గంటల 25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు.

ఆ తర్వాత… ‘రైతు గోస-బీజేపీ భరోసా’లో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత… తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

నిజానికి గతంలోనే ఖమ్మంలోనే సభను నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ. కానీ వర్షాల కారణంగా అమిత్ షా టూర్ రద్దైంది.

ఇక మరికొద్దిరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా…. కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖారులోగా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

అమిత్ షా సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా అమిత్ షా ప్రసంగం ఉండే అవకాశం ఉంది.

ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ… చాలా మంది నేతలు పార్టీలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో..పార్టీ మారే నేతలను తమవైపు తీసుకువచ్చేందుకు కమలనాథులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment