గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన దేశ రాజధానికి..

Get real time updates directly on you device, subscribe now.

దేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /ఆగస్టు 26:
రాష్ట్రంలో కలకలం రేపిన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరింది.

ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి గిరిజన సంఘాల నేతలు తీసుకెళ్లారు.

శనివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ నీల రవి నాయక్ కలిశారు. మహిళపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశాన్ని స్పీకర్‌కు గిరిజన సంఘాల నేతలు వివరించారు.

ఒక మహిళను ఇంతలా కొట్టడం ఏంటని స్పీకర్ అడిగినట్టు గిరిజన నేతలు చెప్పారు. పోలీసులు మహిళలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం బాధాకరమని స్పీకర్ అన్నారని వారు తెలిపారు.

మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతి భద్రతలు లేవన్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందన్నారు. బీఆర్‌ఎస్ నేతల ఇండ్లలో మహిళలపై ఇలాగే అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా అని ప్రశ్నించారు.

గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గిరిజన మహిళ వరలక్ష్మికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న సోయం బాపురావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.సోయం బాపురావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం అది ఆయన వ్యక్తిగతం అంటూ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైనా సోయం బాపురావు ఎలా వ్యతిరేకిస్తారని నిలదీశారు. సోయం బాపురావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే అని తెలిపారు.

ఢిల్లీకి ఫిర్యాదు చేయడానికి వస్తే తెలంగాణ పోలీసులు బెదిరిస్తున్నారని మంత్రులను కాదని ఎలా వెళ్తారని బాధితురాలు బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారని నీలం రవి అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment