కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు..
హ్యూమన్ రైట్స్ టుడే/కాటారం/ఆగస్టు 26:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
భూపాలపల్లిజిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, జిల్లా కలెక్టర్ కు 15 రోజుల్లో తెలియజేయాలని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.