నిజాలు నిర్భయంగా రాసే పత్రికల ఎడిటర్ల పరిస్థితి..
వాస్తవాలకు ప్రతిరూపంగా ఉన్న మీడియాకి ప్రజల ఆదరణ..
సమాజాన్ని సంస్కరించాలనుకున్న పత్రికల జాడ ఎక్కడ…??
(1)”తెహల్కా” పత్రిక సంచలనాలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 25: ఒకప్పుడు ఢిల్లీ కేంద్రంగా అవినీతి-అక్రమాలపై పరి శోధనాత్మ కమైన కధనా లు,స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి పలు కధనాలు,వీడియో లు ఆధారంగా దేశంలో సంచలనం కలిగించిన పత్రిక తెహల్కా డాట్ కామ్.ఈ పత్రికను తరుణ్ తేజ్ పాల్ అనే వ్యక్తి అని రుద్ బహల్ అనే మరోవ్యక్తి తో కలిసి 2000 సంవత్స రం ముందు నుండి 2010 సంవత్సరం కాలం లో నడిపాడు.
2000 సం౹౹ లో క్రికె ట్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభ కోణంపై “తెహెల్కా” పత్రిక మొదటి స్టింగ్ ఆప రేషన్ చేసింది.2001లో దాని స్టింగ్ “ఆపరేషన్ వెస్ట్ ఎండ్”కి జాతీయఖ్యాతి మరియు ప్రజల మద్దతు లభించింది.ఈ 2001 రహ స్య ఆపరేషన్ నకిలీ ఆయు ధాల ఒప్పందంలో ప్రభుత్వ అధికారులు వేశ్య లు మరి యు లంచాలు స్వీకరిస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసి విడుదల చేసింది.దీంతో అప్పటి రక్షణ శాఖ మంత్రి, ఇద్దరు అధికార పార్టీ అధ్య క్షులు సహా పలువురు అధి కారులు రాజీనామాలు చే శారు.2007లో తెహల్కా బజరంగ్ దళ్ సభ్యులకు వ్యతిరేకంగా మరియు నరో దాపాటియా హత్యా కాండ లో వారి పాత్రకు వ్యతిరేకం గా ఒక నివేదికను ప్రచురిం చింది.2002 గుజరాత్ హింస .”ది ట్రూత్: గుజ రాత్ 2002 ” అని పిల వబడే నివేదిక, హింసలో సభ్యులు తమ పాత్రను అంగీకరించిన వీడియో ఫుటేజ్‌తో పాటు ఆరు నెలల స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా రూపొందించ బడింది,దానితో పాటు “ప్రగ ల్భాలు పలికే అబద్ధాలు” అని నిరూపించబడింది. ఇది 2010 మరియు 2011 లో జర్నలిజంలో అత్యుత్త మ ప్రదర్శన కోసం ఇంటర్నే షనల్ ప్రెస్ ఇన్స్టి ట్యూట్ (IPI) ఇండియా అవార్డును గెలుచుకుంది. అనంతరం సహోద్యోగి లైంగిక వేధింపు లు కేసులో అరెస్ట్,పత్రిక పై కోట్ల రూపాయలు పరువు నష్టం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
నేటి తెలుగు రాష్ట్రాలు గా ఉన్న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా మొదటిసారి పదవి చేపట్టిన చంద్రబాబు పై కూడా తెహల్కా పత్రికదృష్టి పెట్టింది.కేవలం రెండున్నర ఎకరాల ఉన్న వ్యక్తి సీఎం అయ్యాక మూడు వేల కోట్ల కు అధిపతి ఎలా అయ్యా డు అనే తెహల్కా ఆరోపణ ల కథనానికి నాడు చంద్ర బాబు సంజాయిషీ ఇచ్చు కోవాల్సిన కథనాలను తెహల్కా ఇచ్చింది అని తెలుస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో పత్రిక ఎన్నో సవాళ్ళను, ఇబ్బందులను ఎదుర్కొంది అనేది వాస్తవం.చివరికి తెహల్కా ఆర్ధిక మూలాల దెబ్బతిన్న సందర్భంగా మూసివేతకు దారి తీసింది. అయితే నిజాలు నిర్భయం గా రాస్తూ…ప్రభుత్వాలలో జరుగుతున్న కుంభకోణాల ను ఆధారాలతో నిరూపి స్తూన్న పత్రికకు ప్రజల అండదండలు లభించా యి.హిందీ,ఇంగ్లీషు భాష ల్లో నడిచిన ఈ తెహల్కా పత్రికకు ఆర్ధిక సహకారం అందిస్తూ ఎందరో ఆ పత్రి కా పాఠకులు, తెహల్కా పత్రికా కార్యాల యానికి ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ మనీ-ఆర్డర్స్, నగదు చెక్స్ పంపారు. అప్పట్లో ఆ పత్రిక కు పాఠకులు అందించిన ఆర్ధిక సహకారం 25లక్షలు పైగా అందినట్లు సమా చారం.అనంతరం తరుణ్ తేజ్ పాల్ పై వచ్చిన వివా దాలతో ఆయన కాలక్ర మంలో తెహల్కా డాట్ కామ్ ని వీడిపోయారు.
*(2)”ఎన్ కౌంటర్” ఎడిటర్ దశరద్ రామ్ మరణం వరకు రాజీలేని పోరాటం.*
ఒక “కలం” ఈ సమాజం కోసం అక్షర సమరం చేసిం ది.అవినీతి-అక్రమాలకు, రాజకీయ కుయుక్తులను, లంచగొండి వ్యవహారాల ను,కుల ఆధిపత్యాలను వ్యతిరేకించి,ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుగా నిలిచి ప్రాణాలకు తెగించి రాసిన కథనాల ప్రతిఫలంగా ఆ కలం హత్యకు గురైంది.
తనవంతు ప్రయత్నంగా ఈ సమాజాన్ని ఆవహిస్తున్న చీకటి,అవినీతి-అక్రమాల పై వ్యతిరేక విధానాలను ఆ కలం అంతమొంధించే బాధ్యత చేపట్టింది.అయితే ఇదే సమాజంలో ఉన్న కొన్ని అసాంఘిక శక్తులకు ఆ కలం అడ్డుగా నిలిచింది. సమాజంలో నీతికన్నా- అవినీతికి బలం ఎక్కువ అనేది ఈ కలం హత్యతో 1985లో రుజువు అయ్యిం ది.సమసమాజ స్థాపన కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ కౌంటర్ దశరధ్ రామ్ అనే కలం వీరుడి చేతిలో ఆ కలం ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలపై ఒళ్ళు విరిచి.. తుళ్ళిపడి.. అక్ష రాలను అగ్ని కణాలుగా రగిలించి చేసిన అక్షర సమరానికి ఫలితంగా ఓ అక్షర యోధుడు బలైపో యాడు.
దశరథ రామ్ ఎన్ కౌంటర్ పత్రిక నడిపిన విధా నం జర్నలిస్టులు తెలుసు కుని ఉండాలి. ప్రస్తుతం పత్రికలు నడవాలి అంటే ఆర్ధిక వనరులు తప్పని సరి.ఈ విధానాన్ని అడ్డు పెట్టుకుని పత్రికలు వ్యాపా ర ధోరణి అవలంభిస్తున్న తీరు సరియైన విధానం కాదు.అయితే పత్రికలు నడవడానికి వాణిజ్య ప్రక టనలు ప్రకటించడం అనేది కూడా యాజమాన్యాలకు చాలా అవసరం.కాకపోతే ఈ ప్రకటనల సేకరణ గౌరవ ప్రదమైన విషయంగా ఉం డాలి.ఇకపోతే మనం చెప్పు కుంటున్న ఎన్ కౌంటర్ పత్రి క ప్రజా సమ స్యలపై,కులా ల ఆధిపత్యం పై, మూఢ నమ్మకాలపై,అవినీతి రాజ కీయాలపై పోరా డింది. పత్రికలో ప్రకటనల కోసం ఆరాటపడలేదు.
కారంచేడు ఘటనలో నిరాశ్రయులైన భాధితుల కు ఎన్ కౌంటర్ ఎడిటర్ గా తాను చేయగలిగినంత సాయం చేశాడు పింగళి దశరద్ రామ్.సంఘటన ప్రాంతం నుండి అగ్రకుల దాడులకు భయపడి చీరా ల సముద్ర తీర ప్రాంతంలో తలదాచుకున్న దళితులకు కొన్ని రోజుల పాటు నిత్యా వసర సరుకులు అందించా డు ఎన్ కౌంటర్,ఎడిటర్, దశరద్ రామ్.ఎలా వారి ఆకలి తీర్చి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారం టే…ఈ సమాజం పట్ల ఆయన బాధ్యతగా ఉన్నా రనేది ఓ కాలనీ రూపంలో మన కళ్ళకు కనిపిస్తున్న సాక్ష్యం.మన సొంత అవ సరాలకు ఏ అవకాశం లేక పోతే భార్య పుస్తెలు తాక ట్టు పెడతాం.కానీ ఎదుట వారి ఆకలి,ఇబ్బంది గ్రహిం చి స్వయంగా చూసిన ఈ కలం వీరుడు నాటి పరిస్థి తులు పట్ల నాకేమిటి లాభం…అనుకోలేదు.తన వంతు బాధ్యత వహించా డు.ఒక జర్నలిస్ట్ గా,పత్రికా ఎడిటర్ గా సామాజిక బాధ్యతతో…వారికి సామా జిక భద్రత కల్పించాడు. తన భార్య సుశీలమ్మ తాళి,చెవి కమ్మెలు వంటి బంగారు,ఇతర వెండి ఆభరణాలు తాకట్టు పెట్టి నాటి కారం చేడు బాధితు లకు నివాసానికి,ఆహారం అందించేందుకు నగదు సాయం చేయడం జరిగిం ది.అనంతరం కొన్నాళ్ళకు ప్రభుత్వం కూడ వారు తల దాచుకున్న సమీప ప్రాంతం లోనే వారికి ఇళ్లస్థలాలు ఇవ్వగా నాడు అక్కడ ఏర్ప డిన విజయనగర్ కాలనీ ఏర్పాటు వెనుక ఎన్ కౌంట ర్ దశరద్ రామ్ పాత్రకూడా ఉంది.
అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో ఒకప్పుడు ఓ సినిమా థియేటర్ ప్రారం భోత్సవం సమయంలో ఒక బాలుడి నరబలి జరిగింది అనే విషయం తెలుసుకు న్న దశరద్ రామ్ ఆ విష యాన్ని పూర్తి వివరాలు సేకరించి తన ఎన్ కౌంటర్ పత్రికలో ప్రచురించి నాటి ఓ పార్టీ సీనియర్ నేతకి చెం దిన సినిమా థియేటర్ లో నరబలి కధనం సంచలనం అయ్యింది.అయితే ఆనాటి ఆ సినిమా హాల్ యజమా నిగా చెప్పబడిన వ్యక్తి కొన్నే ళ్ళ క్రితం ఏపీ సీఎంగా కూ డా ఉన్నారు.అయితే అప్ప ట్లో ఆ ఎడిషన్స్ మార్కెట్లో వచ్చి తెనాలి అంతటా సం చలనం అయ్యింది.దానితో తెనాలిలో ఆ పత్రిక విక్ర యం జరుగుతున్న షాపుల వద్ద ఎన్ కౌంటర్ పత్రిక కాపీ లను బలవంతంగా లాక్కు ని రోడ్లపై దగ్డం చేయడం జరిగింది.దానికి సమాధా నంగా దశరద్ రామ్ అప్పు చేసి మరీ ఆనాడు ఆ ఎడి షన్ మరిన్ని కాపీలు ప్రింట్ చేయించారు. ఆయనే స్వ యంగా తెనాలి వీధుల్లో రిక్షాలో తిరుగుతూ వంద లాది కాపీలు రోడ్ల వెంట క నిపించిన ప్రతివ్యక్తికి నాటి ఎన్ కౌంటర్ పత్రికను ఉచి తంగా పంచిపెట్టారు.
ఇలా సంఘటన ఏదైనా గానీ…సమాజంలో జరుగు తున్న ప్రజా వ్యతిరేక విధా నాలను ఖండిస్తూ ప్రజల్లోకి సమాచారం దశరద్ రామ్ చేరవేసే వాడు.ఈ క్రమంలో పత్రిక ప్రింటింగ్ ఖర్చులకు ఎవరిని డబ్బు కావాలి అని ఆడిగే వాడు కాదు.అవి నీతి వ్యవహారాలు బయట పెట్టేందుకు ప్రజల్లోకి పత్రిక ద్వారా సమాచారం చేర వేసేందుకు తెలిసిన వారిని అప్పు రూపంలోతెలియని వారివద్ద తీసుకున్న నగ దుకు వడ్డీ చెల్లించి పత్రిక ను అనుకున్న సమయానికి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా ప్రయ త్నాలు చేసి సక్సెస్ అయి నప్పటికీ హత్యకు గురి కావడం జరిగింది.
*ఈపూరి రాజారత్నం*
*MA(P.hD)*
*Journalism*
*సీనియర్ జర్నలిస్ట్*
*9390062078*